: రాష్ట్రాన్ని జపాన్ లా అభివృద్ధి చేసే సామర్థ్యం బాబుకే ఉంది: రాయపాటి


టీడీపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలజల్లు కురిపించారు. పసుపు కండువా కప్పుకున్న తర్వాత ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేవలం చంద్రబాబునాయుడు మాత్రమే అభివృద్ధి చేయగలరని కొనియాడారు. రాష్ట్రాన్ని జపాన్ లాగా చేసే సామర్థ్యం చంద్రబాబుకు ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News