: టీడీపీలో చేరిన రాయపాటి


దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఉన్న రాయపాటి సాంబశివరావు ఈ రోజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు రాయపాటి శ్రీనివాస్ కూడా సైకిలెక్కారు. రాష్ట్ర విభజనను మొదట్నుంచి వ్యతిరేకిస్తున్న రాయపాటి... విభజన ప్రక్రియ ఊపందుకోగానే పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. విభజన నేపథ్యంలో, అమెరికాలో ఉండగానే కాంగ్రెస్ పార్టీకి తన రాజీనామా పంపారు. రాయపాటిని టీడీపీ అధినేత చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి పలువురు నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్, కోడెల, నన్నపనేనిలు ఈ సందర్భంలో రాయపాటితో ఉన్నారు.

  • Loading...

More Telugu News