: తిరుమల అటవీప్రాంతంలో మళ్ళీ ఎగిసిపడుతున్న మంటలు
తిరుమల శేషాచలం అటవీప్రాంతంలో మళ్ళీ మంటలు ఎగిసిపడుతున్నాయి. శ్రీవారి మెట్టు వద్ద లోయ ప్రాంతంలో మంటలు చెలరేగి దట్టంగా వ్యాపిస్తున్నాయి. శ్రీవారి మెట్టు నుంచి శ్రీవారి పాదాల వైపు మంటలు దూసుకొస్తున్నాయి. లోయ ప్రాంతం కావటంతో అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకోలేకపోవడంతో... అటవీశాఖ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది చెట్టు కొమ్మలతో మంటలను అదుపుచేయటానికి ప్రయత్నిస్తున్నారు.