: మల్కాజిగిరి నుంచే పోటీ చేస్తా: జేపీ
మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచే తాను పోటీ చేస్తానని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ప్రకటించారు. ప్రజా సమస్యపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సుముఖత చూపుతున్నారు. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన వారు ఎక్కువగా ఉన్నారు. ఎమ్మెల్యే నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. సామాజికవేత్త, నటి చందనా చక్రవర్తిని పోటీకి దించాలని ఏఏపీ భావిస్తోంది. ఇక, టీడీపీ తరపున పోటీ చేయడానికి రేవంత్ రెడ్డితో పాటు మోత్కుపల్లి, ఎర్రబెల్లి ఆసక్తి చూపుతున్నారు.