: మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ 75 నుంచి 80 శాతం: ఈసీ రమాకాంత్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ 75 నుంచి 80 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాదులోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈసీ మీడియాతో మాట్లాడారు. పలు చోట్ల ఇంకా క్యూ లైన్లలో ఓటర్లు ఉన్నారని, రాత్రి ఏడు గంటలకు పోలింగ్ పూర్తవుతుందని అన్నారు. రాష్ట్రంలో ఏడు చోట్ల మాత్రమే రీపోలింగ్ జరపాల్సిన అవసరం ఉండవచ్చని ఈసీ చెప్పారు. నల్గొండలో రెండు చోట్ల, నందిగామలో 2, తాడిపత్రి, మదనపల్లిలో ఒక్కో పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. మంగళవారం నాడు రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు