: మోడీకి క్షమాపణ చెఫ్పను గాక చెప్పను: మసూద్


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ‘ఖండ ఖండలుగా నరికేస్తా’నంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసి జైలుపాలైన ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్... మోడీకి, బీజేపీకి క్షమాపణ చెెప్పేది లేదని తేల్చి చెప్పాడు. మోడీని ఘాటుగా విమర్శించిన మసూద్ పై ఐపీసీ సెక్షన్ 125 కింద దేవ్ బంద్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శనివారం నాడు అతడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. మసూద్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

  • Loading...

More Telugu News