: నందిగామ 19వ వార్డులో మళ్లీ మొదలైన పోలింగ్
కృష్ణాజిల్లా నందిగామ పంచాయతీలోని 19వ వార్డులో పోలింగ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. ఇదే వార్డులో హనుమంతపాలెం, అనాసాగరం గ్రామాల్లో రెండు పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ రెండు బూత్ లలో ఓటరు జాబితాలు తారుమారు కావడంతో ఉదయం పోలింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం అధికారులు ఓటరు లిస్టులను మార్పిడి చేయడంతో అనాసాగరం పోలింగ్ కేంద్రంలో మళ్లీ పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల్లోపు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లందరి చేత రాత్రి ఎంత సమయమైనా ఓట్లు వేసేందుకు అవకాశం కల్పించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రజినీకాంతరావు తెలిపారు. అయితే, హనుమంతుపాలెంలో మాత్రం ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు.