: సినీ నటి గుల్ పనాగ్ తరపున ప్రచారం చేసిన కేజ్రీవాల్
సినీ నటి గుల్ పనాగ్ తరపున ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చండీగఢ్ రోడ్ షోలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. హర్యానాలోని చండీగఢ్ లో ఆప్ తరపున గుల్ పనాగ్ పోటీ చేస్తున్నారు. మూడు రోజుల హర్యానా రాష్ట్ర పర్యటనలో భాగంగా చివరి రోజు ఆయన గుల్ పనాగ్ తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హర్యానా, గుజరాత్ ముఖ్యమంత్రులు ముఖేష్ అంబానీ కోసం పని చేస్తున్నారని విమర్శించారు. చండీగఢ్ లో గుల్ పనాగ్ కు ప్రత్యర్థులుగా కాంగ్రెస్ తరపున సిట్టింగ్ ఎంపీ పవన్ కుమార్ బన్సల్ పోటీ చేస్తుండగా, బీజేపీ తరపున కిరణ్ ఖేర్ బరిలో ఉన్నారు.