: తిరుమల శేషాచలం అడవిలో మళ్లీ చెలరేగిన మంటలు
తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో మళ్లీ కార్చిచ్చు రేగింది. శ్రీవారి మెట్టు వద్ద లోయ ప్రాంతంలో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. లోయ ప్రాంతం కావడంతో ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నాయి. దీంతో అటవీ శాఖ, అగ్నిమాపక సిబ్బంది కలిసి చెట్ల కొమ్మలతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. శ్రీవారి మెట్టు నుంచి శ్రీవారి పాదాల వైపునకు మంటలు విస్తరిస్తున్నాయి.