: ఎమ్మెల్యేగా ఉందామని... పీసీసీ చీఫ్ పదవి వదిలేశా: దానం


ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేద్దామని పీసీసీ చీఫ్ పదవి వదిలేశానని మాజీ మంత్రి దానం నాగేందర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిని కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఇస్తానంటే, జోడు పదవులు వద్దని స్వీకరించలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో సంతకం చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచిన కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో బ్లాకు అధ్యక్షుడిగా కూడా పని చేయలేదని విమర్శించారు. గ్రేటర్ పరిథిలోని 24 శాసనసభ స్థానాల్లో 20 స్థానాలను కాంగ్రెస్ గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News