: మధ్యాహ్నానికి 54 శాతం పోలింగ్ శాతం నమోదు


రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోన్న మున్సిపల్ ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 54.59 శాతం పోలింగ్ నమోదు అయింది. 145 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో ఇవాళ ఎన్నికలు జరుగుతోన్న విషయం విదితమే. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 65 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 43 శాతం పోలింగ్ జరిగింది.

ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకు వివిధ జిల్లాల్లో నమోదైన పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో 59.35 శాతం, శ్రీకాకుళం లో 55.44, విజయనగరంలో 55.02, తూర్పుగోదావరిలో 50.18, పశ్చిమగోదావరిలో 51.45 శాతం, కృష్ణాజిల్లాలో 49.25, గుంటూరు జిల్లాలో 59.26 శాతం పోలింగ్ జరిగింది.

ప్రకాశం జిల్లాలో 65.59 శాతం, నెల్లూరులో 53.44, చిత్తూరులో 56.99, కర్నూలులో 55.33, కడప జిల్లాలో 56.24 శాతం పోలింగ్ జరిగింది. అనంతపురంలో 52.55, ఖమ్మం లో 57.34, ఆదిలాబాద్ 43.23, వరంగల్ జిల్లాలో 55.26 శాతం పోలింగ్ నమోదైంది. కరీంనగర్ జిల్లాలో 52.46 శాతం, నల్లగొండలో 52 శాతం, మెదక్ లో 55.41, రంగారెడ్డిలో 56.36, మహబూబ్‌నగర్ లో 56.14 శాతం, నిజామాబాద్ జిల్లాలో 52.67 శాతం పోలింగ్ జరిగింది.

  • Loading...

More Telugu News