: పంచుకోవడానికి ఇది ఇడుపులపాయ ఎస్టేట్ కాదు: యనమల
తూర్పుగోదావరి జిల్లా నుంచి జగన్, విశాఖ నుంచి షర్మిళ, రాయలసీమ నుంచి విజయలక్ష్మి పోటీ చేస్తామంటూ ప్రాంతాలు పంచుకోవడానికి ఇది ఇడుపులపాయ ఎస్టేట్ కాదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమిపాలవుతుందని నివేదికలు రావడంతో కడప వదిలి పారిపోయేందుకు జగన్ చూస్తున్నాడని ఆరోపించారు. జగన్ రావాల్సింది తూర్పుగోదావరి జిల్లాకు కాదని, వెళ్లాల్సింది జైలుకని ఆయన తెలిపారు. కడపలో రోజురోజుకు జగన్ ప్రాబల్యం తగ్గిపోతోందని ఆయన వెల్లడించారు.