: 'గో గోవా గాన్' పోస్టర్ పై అభ్యంతరం
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తాజా చిత్రం 'గో గోవా గాన్' విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఆ చిత్ర పోస్టర్లలో సైఫ్ సిగరెట్ తాగుతున్నట్టు కనిపించడంపై ఓ సామాజిక సంస్థ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమ అభిమాన హీరోను చూసి అభిమానులు కూడా పొగతాగేందుకు ఉత్సుకత చూపుతారని అంటోన్న నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టొబాకో ఎరాడికేషన్ (నోట్) సంస్థ ఆ పోస్టర్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.