: తెలంగాణను అడ్డుపెట్టుకుని కేసీఆర్ కోట్లకు పడగలెత్తుతున్నాడు: ఇన్నయ్య
తెలంగాణను అడ్డుపెట్టుకుని కేసీఆర్ కోట్లకు పడగలెత్తుతున్నాడని ప్రజా తెలంగాణ ఫ్రంట్ అధ్యక్షుడు గాదె ఇన్నయ్య ఆరోపించారు. హైదరాబాదులో ప్రజా తెలంగాణ ఫ్రంట్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీలకు సీఎం పదవి ప్రకటించిన టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. బీసీలకు అత్యధిక సీట్లను కేటాయించే పార్టీకే తమ మద్దతు ఉంటుందని ఆయన సూచించారు. తెలంగాణ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులను ఓడించేందుకు ప్రతినిత్యం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.