: పుత్తూరులో ఆందోళనకు దిగిన ఓటర్లు
చిత్తూరు జిల్లా పరిధిలోని పుత్తూరులో తమ ఓట్లు గల్లంతు అయ్యాయంటూ ఓటర్లు ఆందోళనకు దిగారు. పుత్తూరు మున్సిపాలిటీలోని కళ్యాణిపురం ఎస్టీ కాలనీలో అధిక సంఖ్యలో ఓట్లు గల్లంతవ్వడంతో బాధితులు ఆందోళన చేశారు. గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి తమ నిరసన తెలిపారు. ఓటు వేసే వరకు కదిలేది లేదని, తమ ఓటు తమకు ఇవ్వాల్సిందేనని అధికారులను వారు డిమాండ్ చేశారు.