: రేపు సమావేశమవుతోన్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ


భారతీయ జనతాపార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సోమవారం నాడు సమావేశం కానుందని బీజేపీ జాతీయ నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాదులో ఈరోజు (ఆదివారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల కమిటీ సమావేశంలో పొత్తులపై నిర్ణయం తీసుకొంటామని అన్నారు. టీడీపీతో పొత్తుల చర్చలు ముందుకు సాగటం లేదని రాష్ట్ర నేతలు చెప్పారని ఆయన అన్నారు. అయితే, పొత్తులపై రేపు స్పష్టత వస్తుందని... అయితే, ఏ పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించినట్లు వెంకయ్య నాయుడు చెప్పారు.

  • Loading...

More Telugu News