: 'శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్'లో ఇస్రో మాజీ చైర్మన్
ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావుకు ప్రతిష్ఠాత్మక 'శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్' లో చోటు దక్కింది. ఈ నెల 19న వాషింగ్టన్ డీసీలో జరిగిన కార్యక్రమంలో 'సొసైటీ ఆఫ్ శాటిలైట్ ప్రొఫెషనల్స్ ఇంటర్నేషనల్' 50 మంది ప్రముఖ శాస్త్రవేత్తలకు ఈ హోదాను కట్టబెట్టింది. అందులో యు.ఆర్. రావు ఒకరిని ఇస్రో విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
గతంలో ఇస్రో ఛైర్మన్ గా, డిపార్టుమెంట్ ఆఫ్ స్పేస్ సెక్రెటరీగా పనిచేసిన రావు, హాల్ ఫేమ్ లో స్థానం లభించిన ఒకేఒక్క భారతీయుడు కావడం విశేషం. ప్రస్తుతం ఆయన 'అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చి లాబొరేటరీ' గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ గా ఉన్నారు.