: పోలీసులకు మస్కా కొట్టి... ఆపై దొరికిపోయింది
చేసిన ప్రతి అడ్డమైన పనినీ ఫేస్ బుక్ ద్వారా పంచుకుంటే ఏమవుతుందో ఈ అమ్మడికి ఎదురైన అనుభవాన్ని చూస్తే తెలుస్తుంది. అమెరికాలోని వెస్ట్ ల్యాండ్ కు చెందిన కొలీన్(22) ఓ రోజు మద్యం సేవించి కారులో వేగంగా దూసుకుపోయింది. దీన్ని గమనించిన పోలీసులు మర్నాడు ఉదయం కొలీన్ ను పిలిపించి బ్రీత్ అనలైజర్ తో పరీక్షించారు. కానీ, మద్యం సేవించినట్లు బయటపడలేదు. దాంతో ఆమెను విడిచిపెట్టారు. ఈ విషయాన్ని కొలీన్ ఫేస్ బుక్ లో అందరితో పంచుకుంది. మద్యం తాగినా బ్రీత్ అనలైజర్ పరీక్ష గట్టెక్కానంటూ ఘనంగా చెప్పుకుంది. ఇది తెలియడంతో పోలీసులు మరోసారి ఆమెను పిలిచి మూత్ర పరీక్ష నిర్వహించారు. దాంతో ఆమె దొరికిపోయింది. మద్యం తాగితే 80 గంటల వరకు మూత్ర పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. కొలీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.