: ఈ కుర్రోడి సలహా పాటిస్తే అమెరికాకు రూ. 2,400కోట్ల ఆదా


అమెరికా ప్రభుత్వానికి ఏటా రూ.2,400కోట్లు ఆదా అయ్యేందుకు 14 ఏళ్ల భారతీయ బాలుడు ఓ చక్కని సలహా ఇస్తున్నాడు. ప్రభుత్వ కార్యకలాపాల కోసం గారామండ్ ఫాంట్ ఉపయోగించినట్లయితే ప్రింటింగ్ సమయంలో ఇంక్ ను చాలా వరకు ఆదా చేయవచ్చని, తద్వారా భారీగా నిధుల వినియోగం తగ్గుతుందని పిట్స్ బర్గ్ లోని ఏరియా మిడిల్ స్కూల్లో చదువుతున్న సువీర్ మీర్ చందానీ సూచిస్తున్నాడు. ప్రభుత్వ కార్యకలాపాలలో భాగంగా డాక్యుమెంట్లను పెద్ద ఎత్తున ప్రింట్ చేస్తుంటారు. అయితే, ఈ ప్రింట్ లో ఫాంట్ (అక్షరాలు) ను బట్టే ఇంక్ వినియోగం, ఖర్చు ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రింటింగ్ కోసం ఇతర ఫాంట్లకు బదులుగా గారామండ్ వాడమని మీర్ చందానీ సూచన. ఇదైతే తక్కువ ఇంక్ తీసుకుంటుందని చెబుతున్నాడు. ఖరీదైన ఇంక్ ను ఆదా చేయడంతోపాటు ఖర్చు తగ్గించే ఈ సలహా అగ్రరాజ్యానికి నచ్చుతుందో, లేదో చూడాలి.

  • Loading...

More Telugu News