: మున్సి‘పోల్స్’లో 15.22 శాతం పోలింగ్ నమోదు


మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకు 15.22 శాతం పోలింగ్ నమోదైంది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 18.2 శాతం, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 10 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు తమకు అందిన సమాచారం ప్రకారం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఆయన చెప్పారు. ఈవీఎంల బ్యాటరీలు లీకైనా, వీకైనా వాటిని గమనించకుండా మిషన్ ఆన్ చేసిన చోటే అవి మొరాయించాయని, వాటిని కూడా వీలైన చో్ట్ల రిపేరు చేయించడం, లేదా కొత్తవి అందించడం చేశామని ఆయన అన్నారు.

ఈరోజు (ఆదివారం) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా... 10 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి. విజయనగరం, 14.93, విశాఖపట్నం 17.16, శ్రీకాకుళం 17.31, తూర్పుగోదావరి 15.85, కృష్ణాజిల్లా 13. 68, పశ్చిమ గోదావరి 12.23, గుంటూరు 16.67, ప్రకాశం జిల్లా 17, నెల్లూరు 18, చిత్తూరు 16.43, అనంతపురం జిల్లా 15.57, కడప 15.05, కర్నూలు 10, కరీంనగర్ 14, వరంగల్ 12, ఖమ్మం జిల్లా 16.74, ఆదిలాబాద్ 11.94, నల్గొండ 13, మెదక్ 18.05, రంగారెడ్డి 18.25, మహబూబ్ నగర్ 15.97, నిజామాబాద్ జిల్లాలో 13.88 శాతం పోలింగ్ నమోదైంది.

  • Loading...

More Telugu News