: బాహాబాహీకి దిగిన వైఎస్సార్సీపీ, కాంగ్రెస్
కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెరలో వైెస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోట్ల సుజాతమ్మ ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు అభ్యంతరం తెలపడంతో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఆరుగురికి గాయాలయ్యాయి.