: నాల్గో తరగతి విద్యార్థినికి గౌరవ డాక్టరేట్


వయసులో చాలా చిన్న. కానీ ఆ చిన్నారి మేథస్సు పెద్దవారితో పోటీ పడగలదు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు పట్టణానికి చెందిన నాల్గో తరగతి విద్యార్థిని పి.ఆదర్శిని చేతికి ల్యాప్ టాప్ ఇచ్చి చూడండి. అత్యంత వేగంగా దాన్ని ముక్కలు చేసి పెడుతుంది. అంటే ఏ పార్ట్ కా పార్ట్ పీకి పారేస్తుంది. అంతే వేగంగా మళ్లీ సెట్ చేసేస్తుంది. ఇదంతా 10 నిమిషాల్లో పూర్తయిపోతుంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ల్యాప్ టాప్ ను విడదీసి, నిర్మించ సత్తాగల చిన్నదిగా బ్రిటన్ కు చెందిన వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. వియత్నాంలోని హోచిమిన్హ్ పట్టణంలో గతవారం ఈ చిన్నారికి యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. గతేడాది ఏసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించుకుంది. ఆదర్శిని తండ్రి ఐటీ సొల్యూషన్స్ వ్యాపారం నిర్వహిస్తుంటారు. తన తండ్రి షోరూమ్ కు వెళ్లినప్పుడు ల్యాప్ టాప్ ను భాగాలుగా పీకి పారేసి మళ్లీ తిరిగి బిగించడం ఆదర్శినికి ఆసక్తికరంగా అనిపించించడం, అదొక హాబీగా మారిపోవడం జరిగింది.

  • Loading...

More Telugu News