: బీజేపీ నుంచి జశ్వంత్ అవుట్


రాజస్థాన్ లోని బార్మర్ లోక్ సభ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన జశ్వంత్ సింగ్(76) పై బీజేపీ బహిష్కరణ వేటు వేసింది. పార్టీ అభ్యర్థిపై నామినేషన్ వేసినందుకు ఈ చర్య తీసుకుంది. నామినేషన్ల ఉపసంహరణకు శనివారం ఆఖరి రోజు. దీంతో నామినేషన్ వెనక్కి తీసుకోవాలని బీజేపీ ఆయన్ను కోరగా, అందుకు సమ్మతించలేదు. దీంతో జశ్వంత్ ను ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు బీజేపీ నుంచి ప్రకటన వెలువడింది. బార్మర్ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా సోనారాం చౌదరి ఉన్నారు. పార్టీ వ్యవస్థాపకుల్లో జశ్వంత్ ఒకరు. గతంలో ఎన్డీయే ప్రభుత్వంలో ఆర్థిక, విదేశాంగ మంత్రులుగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News