: కడప జిల్లాలో రాళ్ల దాడి...ఉద్రిక్తత
కడప జిల్లా ఎర్రగుంట్లలో మున్సిపల్ ఎన్నికలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలిలో ఓటర్ల స్లిప్ లు, డబ్బుల పంపిణీలో తలెత్తిన ఉద్రిక్తతతో రెండు వర్గాల ఓటర్లు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురు గాయాలపాలయ్యారు.