: మార్కాపురం ఎన్నికల్లో ఉద్రిక్తత
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మార్కాపురం మున్సిపాలిటీ ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో టీడీపీ ఏజెంట్లకు గుర్తింపు పత్రాలు అందజేయకపోవడంతో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మున్సిపల్ కమిషనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లకు రాత్రికి రాత్రే గుర్తింపు పత్రాలు అందజేసి, టీడీపీ ఏజెంట్లకు ఆపడానికి గల కారణాలు తెలపాలని డిమాండ్ చేశారు. దీంతో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగి, ఉద్రిక్తత చోటు చేసుకుంది.