: మేం భలేగా పనిచేశాం: ప్రధాని
యూపీఏ పనితీరుపై ప్రధాని మన్మోహన్ సింగ్ కితాబిచ్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై అందరూ దుమ్మెత్తిపోస్తుండడంతో తప్పదనుకున్నారో, ఏమో, అద్భుతంగా పని చేశామని ఆయనకు ఆయనే సర్టిఫికేట్ ఇచ్చేసుకున్నారు. అసోంలోని శివసాగర్ లోని ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, యూపీఏ 2 ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసిందని అన్నారు. అనేక రంగాల్లో విజయం సాధించామని చెప్పుకొచ్చారు. కొన్ని రంగాల్లో తాము గట్టిగా పని చేసినప్పటికీ ఫలితాలు మాత్రం రాలేదని అన్నారు. ఏతావాతా, గత ప్రభుత్వాలకంటే తమ పనితీరు మహా అద్భుతంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు.