: అరబ్ దేశాల్లో చిక్కుకున్న కార్మికులపై సీఎం చర్చ
అరబ్ దేశాల్లో చిక్కుకుని సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్ర కార్మికులను రాష్ట్రానికి తీసుకువచ్చే అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాయబారి డా.అలీసాద్ భేటీ అయ్యారు.
సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో అక్కడి మన కార్మికుల సమస్యలు, వారి తరలింపు విషయాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో మాజీమంత్రి షబ్బీర్ అలీ కూడా ఉన్నారు.