: మోడీపై పార్టీ నేత వ్యాఖ్యలను ఖండించిన రాహుల్


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. ఇక్కడి ఘజియాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ అటువంటి భాషను ప్రోత్సహించదని చెప్పారు. తాము ప్రేమతోనే మాట్లాడతామని, ద్వేషంతో కాదని పేర్కొన్నారు. మసూద్ వ్యాఖ్యల కారణంగా రాహుల్ ఈరోజు సహరాన్ ప్రచార ర్యాలీని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News