: పాక్ జట్టుకు సక్లెయిన్ భయం
పాకిస్థాన్ జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించిన స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ ఇప్పుడు ఆ జట్టును వణికిస్తున్నాడు. టీ20 పోరులో సెమీ ఫైనల్ బెర్తు కోసం పోటీపడుతున్న వెండీస్ జట్టుకు స్పిన్ కోచ్ గా సక్లెయిన్ సేవలందిస్తున్నాడు. సక్లెయిన్ నిర్దేశంలోనే శామ్యూల్ బద్రి, సునీల్ నరైన్ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. పాక్ ఆటగాళ్ల బలహీనతలు తెలిసిన సక్లెయిన్ తమ సెమీఫైనల్ ఆశలను గల్లంతు చేస్తాడేమోననే భయం పాక్ ఆటగాళ్లను పట్టి పీడిస్తోంది. పాక్ ను ఓడించేందుకు బద్రి, నరైన్ తో కలిసి ముస్తాక్ పథకాన్ని రచిస్తుండడం పాక్ జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది.