: ఏప్రిల్ 2న సోనియా నామినేషన్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏప్రిల్ 2న ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో ఏప్రిల్ 30న పోలింగ్ జరుగుతుంది. కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వాద్రాలతో కలసి వచ్చి సోనియా నామినేషన్ వేస్తారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కిషోర్ లాల్ శర్మ తెలిపారు.