: తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
టీ20 ప్రపంచకప్ లో న్యూజిలాండ్ తో పసికూన నెదర్లాండ్స్ హోరాహోరీ పోరాడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. బోరెన్(49), కూపర్(40), స్వార్ట్(26) రాణించడంతో నెదర్లాండ్స్ జట్టు న్యూజిలాండ్ ముందు పెద్ద లక్ష్యాన్ని ఉంచగలిగింది. 152 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన గుప్తిల్, వేన్ డర్ గాగ్టన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. దీంతో 6 ఓవర్లకు న్యూజిలాండ్ ఒక వికెట్ నష్టపోయి 42 పరుగులు చేసింది. మెక్ కల్లమ్(11), విలియమ్సన్(22) క్రీజులో ఉన్నారు.