: డీఎంకే అభ్యర్థిని ఓడించండి: అళగిరి
డీఎంకే అభ్యర్థిని ఓడించాలని ఆ పార్టీ బహిష్కృతనేత అళగిరి పిలుపునిచ్చారు. తనను పార్టీ నుంచి బహిష్కరించినా ఒక్క మాట అనని అళగిరి, తొలిసారి ఆ పార్టీకి వ్యతిరేకంగా పిలుపునిచ్చారు. ఉసిలమ్ పట్టి గ్రామంలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధేనీ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పోన్ ముతు రామలింగంను ఓడించి నాలుగో స్థానానికి పరిమితం చేయాలని కార్యకర్తలకు సూచించారు.