: చిత్తూరు జిల్లా కాల్వపల్లిలో రేగిన కార్చిచ్చు
చిత్తూరు జిల్లా పరిధిలో మరో కార్చిచ్చు చెలరేగింది. పలమనేరు సమీపంలోని కాల్వపల్లి అడవిలో కార్చిచ్చు వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శకటాలు అడవిలోకి బయల్దేరి వెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. శేషాచలం అడవుల్లో కార్చిచ్చు చెలరేగి మూడు నాలుగు రోజుల పాటు అధికారులను కంటి మీద కునుకు లేకుండా చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని అడవుల్లో కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.