: తృణమూల్ బరిలో సినీ తారలు
సార్వత్రిక ఎన్నికల్లో సినీతారలకు సీట్లు కేటాయించడం పట్ల పశ్చిమబెంగాల్ రాష్ట్ర సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సినీ పరిశ్రమ కృతజ్ఞతలు తెలిపింది. బెంగాలీ సూపర్ స్టార్ దేవ్ మిడ్నాపూర్ లోని ఘటాల్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రముఖ నటి మూన్ మూన్ సేన్ బంకుర నియోజకవర్గం నుంచి, పాతతరం సినీ నటి సంధ్యారాయ్ మిడ్నాపూర్ స్థానాల నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పశ్చిమబెంగాల్ లోని 42 లోక్ సభ స్థానాలకు 5 విడతల్లో పోలింగ్ జరుగుతుంది.