: భూమా, శిల్పా వర్గీయుల మధ్య ఘర్షణ
కర్నూలు జిల్లా నంద్యాలలో భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకునేంత వరకు పరిస్థితి వెళ్లింది. అనంతరం ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి బావమరిది ఆదిరెడ్డిపై పలు కేసులు నమోదు చేశారు.