: ఎన్నికల కోసం ఢిల్లీలో ప్రత్యేక సాఫ్ట్ వేర్
ఢిల్లీలో ఆ రాష్ట్ర ఎన్నికల అధికారులు ఓ కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఢిల్లీ ఓటర్ల కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించుకుని... ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా ఓటర్లు ఎన్నికల అధికారులకు సమాచారం చేరవేయవచ్చు. ఓటర్లలో చైతన్యాన్ని పెంపొందించడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ తెలిపారు.