: నొప్పి బాగా వేధిస్తోందా..? రాత్రి వేళ్లలో బాగా నిద్రించండి
దీర్ఘకాలికంగా నొప్పితో బాధపడుతున్నారా? అయితే మీకు మంచి నైట్ స్లీప్ అవసరం. రాత్రుళ్లు ప్రశాంతమైన గాఢ నిద్ర పోయి పగలు పని మొదలు పెట్టండి. మార్పును మీరే చూస్తారు. నొప్పితో బాధపడేవారు శారీరక శ్రమతో కూడిన పనులు చేసే ముందు రాత్రుళ్లు మంచిగా నిద్ర పోవాలని, అదే మంచి చికిత్సగా యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ పరిశోధకులు చెబుతున్నారు. దీర్ఘకాలిక నొప్పితో బాధపడేవారు రాత్రుళ్లు మంచిగా నిద్రించినప్పుడు... వారు మరింత శారీరక శ్రమకు ఓర్చుకుంటున్నారని అధ్యయనానికి నాయకత్వం వహించిన నికోల్ టాంగ్ తెలిపారు. నిద్రకు స్వస్థతనిచ్చే శక్తి ఉంటుందని చెప్పారు.