: పవన్ కల్యాణ్ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన శేఖర్ కమ్ముల
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుపై ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విశాఖలో పవన్ ప్రసంగంతో నిరాశ చెందిన ఆయన, తన భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేశారు. మోడీని గెలిపించాలనే దానిపై శేఖర్ కమ్ముల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
'పూర్తిగా నిరాశ చెందాను, తికమకపడ్డాను, మొదటి రోజు ఆవేశం ఎటుపోయింది? ఒక అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు మరో అరాచకాన్ని అరువు తెచ్చుకోవడం పోరాటం అనిపించుకోదు. దీనికి సేనతో పని లేదు. ఒక వ్యక్తిని గెలిపించండి అని చెప్పడానికి ఇంత ఆవేశం అక్కర్లేదు. ఈ ఆవేశం పోరాటాలకు దాచుకుందాం. కులం, మతం, ప్రాంతం పేరున విద్వేషాలు రేపి ఎన్నికల్లో గెలవాలని చూసే ఏ వ్యక్తికి గానీ, పార్టీకి గానీ మనల్ని పరిపాలించే అర్హత లేదు' అని ఫేస్ బుక్ లో వ్యాఖ్యానించారు.