: ఎన్.సి.టి.సి ఆమోదం పొందుతుంది: హోంమంత్రి షిండే
దేశంలో టెర్రరిజాన్ని రూపుమాపడానికి కేంద్రం ప్రతిపాదించిన ఎన్.సి.టి.సి (నేషనల్ కౌంటర్ టెర్రరిజమ్ సెంటర్) త్వరలోనే
కార్యరూపం దాల్చనున్నట్టు కేంద్ర హోంశాఖ వర్గాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.
ఏప్రిల్ 15న ఢిల్లీలో జరగనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఎన్.సి.టి.సి తప్పకుండా ఆమోదం పొందుతుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ధీమా
వ్యక్తం చేస్తున్నారు. దీనిలో వ్యతిరేకత వ్యక్తం చేయడానికి ఏమీ లేదని ఆయన అన్నారు.
దీని ద్వారా ఎలాంటి కేసులోనైనా ఎవరినైనా స్థానిక పోలీసులు అరెస్టు చేసే అధికారం ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం కూడా కచ్చితంగా ఉంటుందన్నారు. అయితే, దీన్ని ఎప్పుడు తీసుకువచ్చేది అదే రోజు అంతర్గత భద్రత సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. ఫిబ్రవరిలో హైదరాబాద్ దిల్ షుక్ నగర్ పేలుళ్లు జరిగినప్పుడు మళ్లీ ఎన్.సి.టి.సి తెరపైకి తెచ్చారు. గతంలో దీన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ వ్యతిరేకించారు.