: చేసి చూపిస్తాం: సోమిరెడ్డి
ఇచ్చిన హామీలు నెరవేర్చి చూపిస్తామని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాలు విసిరారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీకి టీడీపీని విమర్శించే హక్కు లేదని అన్నారు. జగన్, కేసీఆర్ నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో విలీనం, విశ్వసనీయత అని మాట్లాడిన కేసీఆర్, హైదరాబాద్ రాగానే మాట మార్చాడని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల అమలు సాధ్యమో, కాదో టీడీపీ చూసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీ చేసి తీరతామని ఆయన స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే సత్తాలేని వైఎస్సార్సీపీకి తమను విమర్శించే అర్హత లేదని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.