: వాళ్లు చేసిన తప్పులకు ఆవేశం, కోపం, బాధ కలుగుతున్నాయి: చంద్రబాబు
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాధనాన్ని దోపిడీ చేసి, అధికార దుర్వినియోగానికి పాల్పడి కొడుకుకు ఆస్తులు కూడబెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో బాబు పాదయాత్ర నేటికి 8వ రోజుకు చేరింది.
ఈ సందర్భంగా బాబు బిక్కవోలు లో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, వైఎస్ అవినీతి, జగన్ చేసిన దోపిడీలను ఎండగట్టారు. బెంగళూరు, లోటస్ పాండ్ లలోని రాజభవంతులు జగన్ దర్పానికి పరాకాష్టని బాబు ధ్వజమెత్తారు. అన్ని రాష్టాలూ ముందుకు పోతోంటే, మన రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పెద్దలు చేసిన అక్రమాలు చూస్తుంటే బాధ, కోపం, ఆవేశం కలుగుతున్నాయని చంద్రబాబు అన్నారు.