: రాజకీయాల్లో చేరికపై విద్యాబాలన్ వివరణ
నటనకే పరిమితమవుతానని, రాజకీయాల్లో చేరే ఆలోచన ఏదీ లేదని బాలీవుడ్ నటి విద్యాబాలన్ స్పష్టం చేశారు. బాధ్యతగల పౌరురాలిగా ఓటు హక్కును వినియోగించుకోవడం తప్ప, రాజకీయాలపై ఆసక్తి లేదని ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం సందర్భంగా విలేకరులకు తెలిపారు. ఈ ఫెస్టివల్ కు మూడోసారి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యహరించడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని నేటి రాత్రి విద్యాబాలన్ తిరిగి భారత్ కు రానున్నారు. సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ నుంచి పద్మశ్రీ అవార్డు అందుకోనున్నారు.