: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక ఖరారు: దిగ్విజయ్
లోక్ సభ ఎన్నికలకు తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో సమావేశమై అసెంబ్లీ అభ్యర్థులను కూడా ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. కాగా, పొత్తులపై టీఆర్ఎస్ ద్వారాలు మూసుకుంటే సంతోషమేనని ప్రకటించారు.