: నగదు పంచుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తల అరెస్టు
చిత్తూరు జిల్లా మదనపల్లెలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లె మున్సిపాలిటీ ఆరో వార్డులో నగదు పంచుతుండగా ఆ పార్టీ కార్యకర్తలు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.38వేలు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.