: విమాన శకలాలు రోజుకోచోట ఎందుకు కనిపిస్తున్నాయంటే...


సముద్రంలో కుప్పకూలిన విమాన శకలాలపై శాటిలైట్ ఫొటోల పేరిట రోజుకో కథనం విన్పిస్తోంది. దీంతో శకలాల అన్వేషణ క్లిష్టమవుతోంది. శాటిలైట్ తీసిన ఫొటోల్లో శకలాలు రోజుకోచోట కన్పించడానికి కారణం, అక్కడి సముద్ర ఉపరితల వాతావరణం. దక్షిణ హిందూ మహాసముద్రం అంటే ఆస్ట్రేలియాకి దగ్గర్లో ఉన్న సముద్రంలో వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుంది. దీనికి తోడు భయంకరమైన ఈదురుగాలులు, ఇవి కూడా చాలవన్నట్టు భోరున కురిసే వాన ఈ ప్రాంత పరిసరాల్లో సర్వసాధారణం.

దీంతో అల్లకల్లోలంగా వీచే గాలుల కారణంగా సముద్రంలో తేలియాడుతున్న శకలాలు రోజూ కొంత దూరం ప్రయాణిస్తున్నాయి. అన్వేషణకు బయల్దేరే నౌకలు, విమానాలు ఆ ప్రాంతానికి చేరుకునే సరికి అవి మరో చోటుకి కదిలిపోతున్నాయి. దీంతో ఒకసారి శాటిలైట్ పంపే చిత్రాలు, ముందు పంపిన చిత్రాలతో సరిపోలడం లేదు. దీని కారణంగా శకలాల అన్వేషణ మరింత కష్టమవుతోంది.

ఇలాగే శకలాలు మరో ఏడాదిపాటు ప్రయాణిస్తే రోజుకు 70 కిలోమీటర్ల చొప్పున, ఏడాదికి 2600కిలో మీటర్లు ప్రయాణించి దక్షిణ ఆస్ట్రేలియా వరకు వెళ్లే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. శకలాలు మరోదిశగా ప్రయాణిస్తే, ఇతర సముద్రజలాల్లోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇలా జరిగితే మాత్రం శకలాలు వెతకడం మరింత కష్టతరం కానుంది.

  • Loading...

More Telugu News