: బీజేపీలో దావూద్ ను కూడా చేర్చుకుంటారా?: కలకలం రేపిన నక్వీ వ్యాఖ్యలు
ఇండియన్ ముజాహిదీన్ కు చెందిన యాసిన్ భత్కల్ స్నేహితుడు సాబీర్ అలీ బీజేపీలో చేరడంపై ఆ పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. "టెర్రరిస్ట్ భత్కల్ స్నేహితుడు బీజేపీలో చేరాడు. తర్వాత దావూద్ ఇబ్రహీంను కూడా చేర్చుకుంటారేమో" అని బీజేపీ ఉపాధ్యక్షుడు ముఖ్తర్ అబ్బాస్ నక్వీ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని నక్వీ నిలదీయడం పార్టీ నాయకత్వానికి మింగుడుపడటం లేదు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలంటూ మరో బీజేపీ నేత బల్బీర్ పంజ్ కూడా డిమాండ్ చేశారు.