: నటుడు బాలకృష్ణకు జరిమానా
అనుమతి లేకుండా బోర్ వేసినందుకు సినీ నటుడు బాలకృష్ణకు రెవెన్యూ అధికారులు జరిమానా విధించారు. హైదరాబాదు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఆయన నివాసంలో వాస్తు ప్రకారం చేస్తున్న మార్పుల్లో భాగంగా రెండు రోజుల క్రితం బోర్ వేశారు. ఈ క్రమంలో ముందస్తుగా అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని బాలయ్య మరిచినట్లున్నారు. దానిపై కొంతమంది స్థానికులు రెవిన్యూ అధికార వర్గానికి ఫిర్యాదు చేశారట. విచారణ జరపడంతో బోర్ వేసినట్లు తేల్చుకున్నారు. దాంతో, షేక్ పేట రెవెన్యూ అధికారులు బాలయ్యకు రూ.10వేల జరిమాన విధించారు.