: నింగి నుంచి ఫేస్ బుక్ ఇంటర్నెట్
ప్రపంచ జనాభాలో నేటికీ సగం మందికి ఇంటర్నెట్ అందుబాటులో లేదు. అలాంటి వారికీ ఫేస్ బుక్ ను దగ్గర చేసేందుకు దాని వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ కొత్త ఆలోచనను కార్యాచరణలో పెట్టారు. డ్రోన్లు, చిన్నపాటి ఉపగ్రహాలు, లేజర్ పరికరాల ద్వారా నింగి నుంచి ఇంటర్నెట్ ను సరఫరా చేయాలన్నది ఆయన ఆలోచన. ఫేస్ బుక్ కనెక్టివిటీ ల్యాబ్ లో వీటిని అభివృద్ధి చేయనున్నారు. పరిమిత భౌగోళిక ప్రాంతాలు, శివారు ప్రాంతాల పైన ఆకాశంలోనే ఉండేలా సోలార్ పవర్ ఆధారిత ఎయిర్ క్రాఫ్ట్ లను నిలిపి ఉంచి, సత్వర ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు మార్క్ జుకెర్ బర్గ్ చెప్పారు. ఇతర ప్రాంతాల్లో ఉపగ్రహాల ఆధారంగా ఇంటర్నెట్ అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. తమ పరిశోధక బృందంలో అంతరిక్ష, సమాచార సాంకేతిక నిపుణులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.