: రాహుల్ గాంధీ సహరాన్ పూర్ ర్యాలీ క్యాన్సిల్
ఉత్తరప్రదేశ్ సహరాన్ పూర్ లో నేడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహించాల్సిన ర్యాలీ రద్దయింది. ఈ ప్రాంత లోక్ సభ అభ్యర్థి, పార్టీ నేత ఇమ్రాన్ మసూద్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపాయి. ఈ రోజు మసూద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో పార్టీ చిక్కుల్లో పడటంతో రాహుల్ ర్యాలీని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది.