: మోడీని నరుకుతానన్న కాంగ్రెస్ నేత అరెస్ట్
బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని ముక్కలు ముక్కలు చేస్తానంటూ వ్యాఖ్యానించిన ఉత్తరప్రదేశ్ సహరాన్ పూర్ లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ ను పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. నిన్న ఓ సభలో మసూద్ మాట్లాడుతూ... ఉత్తరప్రదేశ్ ను గుజరాత్ లా చేస్తానన్న మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. 'ఇది గుజరాత్ కాదు. అక్కడ ముస్లింలు 4 శాతమే ఉన్నారు. అదే ఉత్తరప్రదేశ్ లో ముస్లింలు 42శాతంగా ఉన్నారు. చూస్తూ ఊరుకోం' అంటూ మసూద్ వ్యాఖ్యానించారు. దీంతో సహరాన్ పూర్ పోలీసులు మసూద్ పై కేసు నమోదు చేసి ఈ రోజు తెల్లవారుజామున ఆయన్ను అరెస్ట్ చేశారు. మరోవైపు మసూద్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.